నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్నసహాయక కార్యక్రమాలలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భాగం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ పరిశ్రమకి సంబంధించి నటీనటులు, నిర్మాతలు ,దర్శకులు, గాయకులు తన వంతు విరాళాలు అందించారు. తాజాగా కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు ఓం నమో వేంకటేశాయ ఫిల్మ్స్ అధినేత, ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత మరియు ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్ ‘మహేష్ రెడ్డి’ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయిలను విరాళంగా ఇచ్చారు.
కొద్ది సేపటి క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని కలిసి కోటి రూపాయల చెక్‌ని మహేష్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా నిర్మాతకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తప్పక పాటించాలని మహేష్ రెడ్డి కోరుతున్నారు. ఇక ప్రజలు కూడా ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలి, అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.