కరోనాపై పోరు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కనీసం మూడు నెలల పాటు ఇంటి కిరాయి వసూళ్లను వాయిదావేసుకోవాలని, వారిని ఇళ్లలో నుంచి ఖాళీ చేయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటి యజమానులను ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటం, ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయ మార్గాలు మూసుకుపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి కిరాయిలు, భూములకు సంబంధించిన కిరాయిలను ఇంటి యజమానులు, భూస్వాములు వారిని అడకూడదని ప్రభుత్వం సూచించింది. దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 24న 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అయితే కేసుల సంఖ్య తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. దీంతో కిరాయిదారులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం, కిరాయిలు చెల్లించే స్తోమత లేకవడంతో వారిపై ఒత్తిడి తీసుకురావద్దని యజమానులను ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
కిరాయి వసూళ్లను మూడు నెలలు వాయిదా వేసుకోండి: మహారాష్ట్ర ప్రభుత్వం