కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాలని నిన్న ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ.. సామాజిక దూరం అమలు చేయాలని మోదీ ప్రజలను కోరారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సామాజిక దూరం పాటించారు. ఒక్కో మంత్రి కనీసం మూడు మీటర్ల దూరం పాటిస్తూ కూర్చున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై చర్చించారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాన్ని చూసైనా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి.