మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవి భత్యం అందనుంది. జిల్లాలో ఉపాధి పథకం పనులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత అధికం కానుండడంతో కూలీలకు వేసవి కరువు భత్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూలీల వేతనానికి అదనంగా ఈ భత్యం అందనుంది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు
ఉపాధి కూలీలకు వేసవి భత్యం