ఉత్తరప్రదేశ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని, ఆ సంఘటనలపై విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. యూపీ పోలీసులు ఆందోళనకారులపై అన్యాయంగా దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్‌హెచ్ఆర్‌సీని కలిసిన వారిలో మోసినా కిద్వాయి, సల్మాన్ కుర్షీద్, పీఎల్ పునియా, జితన్ ప్రసాద్, అభిషేక్ సింఘ్వి, రాజీవ్ శుక్లా, అజయ్ కుమార్ లల్లూ ఉన్నారు. ఆందోళన సమయంలో మృతిచెందిన వారి సంఘటన పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. యూపీ ప్రభుత్వం తమ ప్రజలపైనే యుద్ధానికి దిగిందన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ఎన్‌హెచ్ఆర్‌సీ తక్షణమే కార్యరూపం దాల్చాలని రాహుల్ తన ట్వీట్‌లో కోరారు
ఎన్‌హెచ్ఆర్‌సీ అధికారుల్ని కలిసిన రాహుల్, ప్రియాంకా